దిగువ ప్రాంతాల ప్రజలకు అప్రమత్తత హెచ్చరిక
Swarna Project : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు నుండి అధికారులు గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులో వరద ప్రవాహం భారీగా చేరింది.
స్వర్ణ ప్రాజెక్టు(swarna project) పూర్తి స్థాయి నీటిమట్టం 1183 అడుగులు. కాగా, ప్రస్తుతం నీటిమట్టం 1182.9 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 16,200 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 21,255 క్యూసెక్కులుగా అధికారులు వెల్లడించారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
శెనార్తి మీడియా, నిర్మల్ /మంచిర్యాల
