BRS Dharna : రైతులకు బోనస్ కింద ఇంకా 98% చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే వాటిని చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దండేపల్లి(Dhandepalli) భారీ ధర్నా చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిందని, గెలిచిన తర్వాత కేవలం సన్న వడ్లకు మాత్రమే చెల్లించిందని మండిపడ్డారు. ఈ మేరకు మంచిర్యాల నియోజకవర్గ రైతులకు రూ. 20 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ. 18 లక్షలు మాత్రమే చెల్లించారు అని అన్నారు.

2291 మంది రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ. 7.5 కోట్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయని, వెంటనే ఈ మొత్తాన్ని విడుదల చేయాలని నడిపెల్లి దివాకర్ రావు డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేసే దాకా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యువ నాయకుడు నడిపెల్లి విజిత్ రావు, మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, సీనియర్ నాయకులు కాసనగుట్ల లింగన్న, గొల్ల రాయమల్లు, పసర్తి అనిల్, పొండేటి శ్రీనివాస్ గౌడ్, పాదం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

శెనార్తి మీడియా, మంచిర్యాల: