tgb
మాట్లాడుతున్న టిజిబి ఆర్ ఎం మురళి మనోహర్ రావు

TGB : ప్రజలకు అందుబాటులో సేవలు

  • టిజిబీ ఆర్ ఎం మురళి మనోహర్ రావు

TGB : తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సేవలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటాయని, ఈ అవకాశాన్ని బ్యాంకు ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్యాంకు మంచిర్యాల రీజియన్ మేనేజర్ మురళి మనోహర్ రావు అన్నారు. బుధవారం సీతారాం పల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆవరణలో ఖాతాదారులతో నిర్వహించిన ‘కాఫీ విత్ కస్టమర్స్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. సీతారాంపల్లి శాఖ 40 సంవత్సరాలుగా సేవలంధిస్తుందని, ఖాతాదారుల సమన్వయంతో అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. తమ శాఖకు ఖాతాదారుల సహాయ సహకారాలు మరువలేనివని, తమ తమ ఆర్థిక అవసరాలన్నింటికీ బ్యాంకులో రుణాలు తీసుకున్నారన్నారు. ఇప్పటికి సీతారాం పల్లి శాఖ ద్వారా రూ. 300 కోట్లకు పైగా వ్యాపారం నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లలో సీతారాంపల్లి శాఖ అత్యధిక వ్యాపారాన్ని నిర్వహిస్తుందన్నారు.

tgb customers
పాల్గొన్న ఖాతాదారులు

సింగరేణి ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలు, మహిళా సంఘాలకు, వ్యాపారస్తులకు వ్యాపార రుణాలు, రైతులకు పంట రుణాలు, వాహనాల కొనుగోలుకు, ఉన్నత చదువులకు బ్యాంకు నిబంధనల మేరకు రుణాలు ఇస్తున్నామన్నారు. ఖాతాదారులు వివిధ ఇన్సూరెన్స్ పథకాలను, హెల్త్ ఇన్సూరెన్స్ పథకాలను, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన మొదలగు సామాజిక ప్రయోజనాల్ని కలిగించే పథకాలు కూడా తమ బ్యాంకు అందిస్తుందన్నారు. టిజిబి మేనేజర్ నరసింహ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టిజిబి చీఫ్ మేనేజర్ (బిజినెస్) రవి కిషోర్ రెడ్డి, సీనియర్ మేనేజర్ (ఆపరేషన్స్) రఘువీర్ శర్మ, ఎస్బిఐ జనరల్ నాగరాజు, ఫీల్డ్ ఆఫీసర్లు హుస్సేన్, రవిలు, అకౌంటెంట్ చంద్రమౌళి, బ్యాంకు సిబ్బంది కిరణ్, సాయి ప్రకాష్, మహాలక్ష్మి, నాగలక్ష్మి, బ్యాంకు ఖాతాదారులు రామన్న, బాపురెడ్డి, రంగారావు, రాజన్న, మల్లారెడ్డి, రాయలింగు, రాజేశం, మల్లారెడ్డి, రవీందర్ రెడ్డి, సత్యనారాయణ రావు, మల్లేష్, అన్నయ్య, తిరుపతి, రంజిత్, రాయలింగు, బాపన్న, చిన్నయ్య, శ్రీధర్ రావు, రజని, ధరణి, సరోజన తదితరులు పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల : 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *