- సింగరేణి సీఎండీ బలరాం నాయక్
CMD BalaramNaik : సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ఎన్. బలరాం నాయక్, కేకే ఓసి గనిని ఆదివారం సందర్శించి, సురక్షితంగా మరియు సమిష్టి కృషితో ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా, బలరాం నాయక్ మాట్లాడుతూ, “సింగరేణి సంస్థ ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యాలను సాధించాలంటే ప్రతి ఒక్కరూ కలసి కృషి చేయాలి. కార్మికులు మరియు అధికారులు రక్షణ సూత్రాలను పాటిస్తూ, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధించాలి” అన్నారు.
పర్యటనలో, ఆయన్ను ఏరియా జనరల్ మేనేజర్ జి. దేవేందర్ పూల మొక్కను అందించి ఘనంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ సూర్యనారాయణ, కేకే ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మందమర్రి
