- సీపీఐ జాతీయ కార్యవవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి సమక్షంలో చేరికలు
AITUC : ఈరోజు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఏఐటీయూసీ యూనియన్‌లో 200 మందికి పైగా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్లు చేరికయ్యారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్, తెలంగాణ అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సాయీశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాస్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కళిందర్ అలీ ఖాన్, జిల్లా కోశాధికారి తోకల సరస్వతి తదితరులు యూనియన్ కండువాలు కప్పి వారికి స్వాగతం పలికారు.
సిపిఐ నేతల హామీ
ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, అంగన్వాడీ ఉద్యోగులను గుజరాత్ రాష్ట్రంలోని మాదిరి ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని, పక్కా భవనాల నిర్మాణంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, అంగన్వాడీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు మిట్టపల్లి వెంకటస్వామి, అధ్యక్షులు అక్బర్ అలీ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లం పూర్ణిమ, రేగుంట చంద్రశేఖర్, ఇప్పకాయల లింగయ్య, లింగం రవి తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల

