Appreciation :హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన రాష్ట్రస్థాయి ఆంగ్ల ఒలింపియాడ్‌లో మంచిర్యాలలోని రాజీవ్ నగర్ ఆదర్శ పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని ఎం సంజన ప్రథమ స్థానం సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి అనేక మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో విజేతగా నిలిచిన సంజనను మంచిర్యాల డీఈవో యాదయ్య శనివారం అభినందించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసే పోటీలు ఎంతో ఉపయోగకరమన్నారు. ఇతర విద్యార్థులు కూడా ఇలాంటి పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న, ఆంగ్ల ఉపాధ్యాయులు డీ సరిత, డీ రమేష్, టీ రజిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల
