Farwell Day: దౌల్తాబాద్ మండలంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యాధికారి మాట్లాడారు. పదో తరగతి ప్రతి విద్యార్థికి తొలి మెట్టులాంటిదన్నారు. పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించి, పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. తెలుగు ఉపాధ్యాయురాలు స్రవంతి తమ సొంత డబ్బులతో విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు అందజేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం వెంకటలక్ష్మి, శాన్వి ఫ్రాన్సిస్, భూపతిరెడ్డి, మహేశ్వరి, మేనక,మంజుల, విజయలక్ష్మి, కృష్ణవేణి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, దౌల్తాబాద్