Vasantha Panchami : నిర్మల్ జిల్లా బాసర(Basara)లోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తుల సందడితో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ (Abhilasha Abhinav) , భైంసా ఆర్డీఓ కోమల్ రెడ్డి, ఆలయ ఇన్‌చార్జి ఈవో సుధాకర్ ఆలయం తరఫున మహాలక్ష్మి, సరస్వతి, మహంకాళి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు.

వసంత పంచమి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల(Nirmal SP Janaki Sharmila) , ఏఎస్పీ అవినాష్, కలెక్టర్ అభిలాష అభినవ్ పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడంతో వారు ఉత్సాహంగా అమ్మవారి సేవలో తరిస్తున్నారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు నిర్వహించేందుకు ఆలయ అధికారులు, పోలీసులు తెలిపారు.

– శెనార్తి మీడియా, బాసర