Prabhas AS Rudra: మంచు మోహన్ బాబు కుమారుడు విష్ణు హీరోగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప'(Kannappa). ఇది కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu), మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్. తన సొంత నిర్మాణ సంస్థలో భారీ బడ్జెట్ తో మైథలాజికల్ (Mythalogical) సినిమాని తెరకెక్కిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో పాటుగా నార్త్, సౌత్ నుంచి ప్రముఖ హీరోలు, నటులు ఇందులో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
కొద్ది రోజులుగా ప్రతీ సోమవారం ఈ సినిమాలోని ఒక క్యారెక్టర్ ను పోస్టర్, గ్లింప్స్ ద్వారా పరిచయం చేస్తున్నారు. ఇక ప్రభాస్(Prabhas) క్యారెక్టర్, లుక్ ఏవిధంగా ఉండబోతుందో అని ఇప్పటి దాకా ఆత్రుతగా ఎదురు చూశారు డార్లింగ్ అభిమానులు. ఇన్ని రోజులు ఊరిస్తూ వచ్చిన మేకర్స్ ప్రభాస్ పాత్ర పేరు, లుక్ ను ఫిబ్రవరి 3న విడుదల చేశారు.
రుద్ర అనే పవర్ ఫుల్ పాత్రలో ప్రభాస్ ‘కన్నప్ప’ సినిమాలో చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో శివ భక్తుడిగా, సన్యాసి వేషధారణలో చేతిలో పొడవైన దండాన్ని పట్టుకొని డార్లింగ్ ప్రభాస్ కనిపిస్తున్నారు. పొడవాటి జుట్టు, నుదుట శివ నామాలు, మెడలో పెద్ద రుద్రాక్ష మాలతో దివ్యమైన రూపంలో ప్రభాస్ ఆకట్టుకున్నారు. తన క్యారెక్టర్ ను ప్రతిబింబించేలా బ్యాక్ గ్రౌండ్ లో మహా శివుడి ప్రతిరూపాన్ని ఈ పోస్టర్ లో పెట్టారు.

”ప్రళయ కాల రుద్రుడు!…
త్రికాల మార్గదర్శకుడు!!
శివాజ్ఞ పరిపాలకుడు!!
అంటూ రెబల్ స్టార్ ప్రభాస్ పాత్ర స్వభావాన్ని ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు.
ప్రభాస్ లుక్ బయటకు రావడంతో డార్లింగ్ అభిమానులు సోషల్ మీడియాలో ఫొటోలను తెగ షేర్ చేస్తన్నారు. ఇన్ స్టా గ్రామ్, వాట్సప్, ఫేస్ బుక్ లో రుద్ర పాత్ర ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
అదే సమయంలో అటు ఇండస్ర్టీ నుంచి ప్రభాస్ లుక్ పై పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మోహన్ బాబు, విష్ణులకు సినిమా సక్సెస్ పై మరింత నమ్మకంగా ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి తమ కుటంబాన్ని ఊరిస్తున్న సక్సెస్ ఈ సినిమాతో మళ్లీ రిపీట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.