- నగర కాంగ్రెస్ అధ్యక్షులు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
- మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్
- డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి
YSR: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెరగని ముద్ర వేశారని నగర కాంగ్రెస్ అధ్యక్షులు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, మిడ్ మానేరు ప్రాజెక్టు, వరద కాలువ, కొండగట్టు జేఎన్టీయూ, మంథని జేఎన్టీయూ, శాతవాహన విశ్వవిద్యాలయం, పాలిటెక్నిక్ కళాశాలలు వంటి అనేక ప్రాజెక్టులు, విద్యా సంస్థలను స్థాపించి జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు.
రైతుల ఆత్మహత్యలను గుర్తించి ఒకే సంతకంతో రైతు రుణమాఫీ చేసిన వైఎస్సార్, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఫీజు రీయింబర్స్మెంట్, పేదల ఆరోగ్య రక్షణకు ఆరోగ్యశ్రీ, అత్యవసర సేవల కోసం 108 అంబులెన్స్ సేవలు, పేదల గృహ అవసరాల కోసం ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలను ప్రవేశపెట్టారు.
వారి ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రయోజనాల కోసం కొత్త సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేస్తూ సేవలందిస్తున్నారని నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, కరీంనగర్
