- మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు
COMPENSATION : ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వరద వచ్చి పంటలు నష్టపోయిన మంచిర్యాల నియోజక వర్గంలోని బాధితులకు పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే (Ex MLA) నడిపెల్లి దివాకర్ రావు (Nadipelly Diwakar Rao) డిమాండ్ చేశారు. మంగళ వారం మండలంలోని గుడిరేవు, లక్ష్మీ కాంతపూర్ గ్రామాలలో పర్యటించి అకాల వర్షాలతో, వరద కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

బాధితులకు పరిహారమివ్వాలి…
పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 40 వేల పరిహారం అందించి ఆదుకోవాలని మంచిర్యాల మాజీ ఎంఎల్ఏ నడిపెల్లి దివాకర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే సాగు కోసం అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ఇబ్బందులు పడుతున్నారని, వాటికి తోడు పంటలు పూర్తిగా నష్టపోయి మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారని, రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. మాజీ ఎంఎల్ఏ వెంట మాజీ వైస్ ఎంపీపీ అనిల్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రేణి శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, నాయకులు అక్కల రవీందర్, రాజి రెడ్డి, వెంకట రమణ, బొమ్మెన మహేశ్, రాయమల్లు, రమేశ్, రైతులు తదితరులు ఉన్నారు.
– శెనార్తి మీడియా, దండేపల్లి (మంచిర్యాల) :
