- పుష్పలత మహేష్‌కు ఘన సన్మానం
PROMOTION : కాటారం మండలంలోని ఎస్సీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్‌గా పని చేసి, ఇటీవల భూపాలపల్లి హైస్కూల్‌కు ప్రమోషన్ పై వెళ్లిన పుష్పలత మహేష్‌ను ఆదర్శ కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ పంతకాని తిరుమల సమ్మయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి సమాజానికి మార్గదర్శకమైనదని, విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు అందించేందుకు ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారన్నారు. పుష్పలత మహేష్ కృషి, అంకితభావం ఫలితంగానే ఈ ప్రమోషన్ సాధ్యమైందని అభినందించారు.
అనంతరం ఆదర్శ కాలనీ వాసులు మాట్లాడుతూ స్థానికంగా పనిచేసి ఎంతోమంది విద్యార్థులకు ఇంగ్లీష్‌పై పట్టు సాధించేటట్లు ప్రోత్సహించిన పుష్పలత మహేష్ ప్రతిభ, పట్టుదల ప్రశంసనీయమని పేర్కొన్నారు. భూపాలపల్లి హైస్కూల్‌లో కూడా ఆమె తన సేవలతో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, ప్రముఖులు, విద్యావేత్తలు, గ్రామస్తులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, కాటారం :
