Police Retirement
ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను సన్మానిస్తునన రామగుండం సీపీ

Police Retirement: శేష జీవితాన్ని ఆనందంగా గడపాలి

  • రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్
  • ఉద్యోగ విరమణ పొందిన అధికారులను సన్మానం ..  జ్ఞాపికలు అందజేసిన సీపీ 
  • అధికారులు, సిబ్బందికి ఎలాంటి సమస్యలు తలెత్తినా ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా  

Police Retirement:  పోలీస్ శాఖ నందు సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులను శుక్రవారం రామగుండం పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఉద్యోగ విరమణ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ పాల్గొని పదవీ విరమణ పొందుతున్న ఏడుగురు పోలీసు అధికారుల కుటుంబ సభ్యుల తో కలిసి శాలువా, పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఉద్యోగ విరమణ పొందిన ఎస్. సుందర్ రావు, ఏ ఆర్ ఏసీపీ, 1985 .సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి ఏ ఆర్ కానిస్టేబుల్ గా ఎంపికై అంచలంచలుగా 1991 సంవత్సరం హెడ్ కానిస్టేబుల్ గా, 1998 సంవత్సరం అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ గా, 2005 సంవత్సరం రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ గా, 2011 సంవత్సరం రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా అదేవిదంగా ఏ ఆర్ ఏసీపీ గా 2019 లో పదోన్నతి పొంది కుటుంబ సభ్యుల సహకారంతో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంఘవిద్రవశక్తులతో పోరాడి యాంటి ఎక్స్మిస్ట్ ఆపరేషన్ నందు విధులను నిర్వర్తించి, ప్రస్తుత పోలీసు వ్యవస్థ ప్రశాంతంగా కొనసాగడానికి కీలకపాత్రను పోషించి 39 సంవత్సరాల,09 నెలల, 1 డే విధులు విజయవంతంగా పదవి విరమణ పొందారు. పోలీసు విధులలో ఉత్తమ ప్రతిభ కనబరచి 33 క్యాష్ రివార్డులు, 01- కమాండేషన్, 24-GSE లు, 02- MSE, సేవా పతకాలు -02, శౌర్య పతకాలు -02, ప్రశంసా పత్రం-01 సాధించడం జరిగింది.

అదేవిదంగా శారదా మహిళ సబ్ ఇన్స్పెక్టర్. 1982 సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి మహిళ కానిస్టేబుల్ గా వచ్చి అంచలంచలుగా ఎదిగి ఎస్ఐ గా పదోన్నతి పొంది సర్వీసులోని 42 సంవత్సరముల 01 నెల విధులను నిర్వర్తించారు. పోలీసు విధులలో ఉత్తమ ప్రతిభ కనబరచి సేవా పతకం-01, ఉత్తమ సేవా పతకం -01, క్యాష్ రివార్డులు -04 లు సాధించడం జరిగింది.

ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ…… గతంలో పోలీసు వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితుల నందు సంఘవిద్రోహశక్తులతో పోరాడి కీలకంగా విధులను నిర్వర్తించి ప్రస్తుతం పోలీసు వ్యవస్థ ప్రశాంతంగా ఉండడానికి గల కారణమైన అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. సుదీర్ఘ కాలం పాటు పోలీసు వ్యవస్థను సేవలందించి పదవీ విరమణ పొందుతున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలను పోలీసులు సక్రమంగా విధులను నిర్వర్తించడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుందని వారి తోడ్పాటు వల్లనే విధులను నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగగలరని తెలియజేశారు. రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ త్వరగా అందించాలని సిబ్బందికి సూచించారు. పదవి విరమణ చేసిన వారు ఇకపై కుటుంబ సభ్యులతో తమ శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.

తమ ఆరోగ్యాల పట్ల తగు జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు. ఎటువంటి అవసరం ఉన్న కమీషనరేట్ పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. పదవి విరమణ పొందిన అధికారులను ప్రభుత్వ వాహనంలో ఇంటి వరకు సాగనంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి అడ్మిన్ సి.రాజు, ఏసీపీ గోదావరిఖని ఎం. రమేష్, ఏఓ శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు వామన మూర్తి , సంపత్, ఆర్ ఎస్ఐ లు ప్రవీణ్ కుమార్, సరిత, రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లా కుంట పోచలింగం, స్వామి, పదవి విరమణ అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శెనార్తి మీడియా, మంచిర్యాల/ గోదావరిఖని 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *