- వరంగల్ సభ దారి ఖర్చుల కోసం..
- కూలీ పనులకు బీఆర్ఎస్ మహిళా నాయకులు
- మక్కచేనులో కంకులు ఏరిన మాజీప్రజాప్రతినిధులు
BRS Women Wing: ఏప్రిల్ 27 న వరంగల్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఖర్చులకు గాను పార్టీ మహిళా విభాగం నాయకులు కూలీ పనులకు వెళ్లారు. నిధులు సేకరణకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ వినూత్న కార్యక్రమానికి బెజ్జంకి మండలంలోని మహిళా విభాగం నాయకురాళ్లు శ్రీకారం చుట్టారు.

బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో రైతు ముక్కీస విజయ – బాల్ రెడ్డి కి చెందిన చేనులో మక్కజొన్న కంకులు ఏరేందుకు మండల మహిళ నాయకులు, కార్యకర్తలు కూలీ పనులకు వెళ్లారు. సభకు దారి ఖర్చుల కోసం తాము కూలీ పనులకు వెళ్లినట్లు మహిళా నాయకురాళ్లు వెల్లడించారు. కూలీ ద్వారా వచ్చే డబ్బులతో దారి ఖర్చులు సర్దుబాటు చేసకుంటామని వెల్లడించారు.
కూలీ పనులకు వెళ్లిన వారిలో మాజీ ఎంపీపీ నిర్మల, మాజీ జడ్పీటీసీ కవిత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చంద్రకళ, అపూర్వ, మాజీ ఎంపీటీసీ పద్మ, మాజీ వైస్ ఎంపీపీ సబిత, లత, వనిత, పద్మ, మమత, తిరుమల, నిర్మల, సరోజన, విజయ, సుజాత, సాత్విక ఉన్నారు.

-శెనార్తి మీడియా, బెజ్జంకి
