MPL
విజేతలకు ట్రోఫీ అందజేస్తున్న అంజనీపుత్ర అధినేత గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి

MPL: ఎంపీఎల్ విజేతలకు బహుమతులు ప్రదానం

MPL: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శివాజి గ్రౌండ్‌లో గత పది రోజులుగా జరిగిన మంచిర్యాల ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) సీజన్- 2 క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఫైనల్ మ్యాచ్‌లో ఎస్సారెస్ (ఎన్టీఆర్ నగర్) పై గుడిపేట టైటాన్స్ (జీటి) విజయం సాధించి ఛాంపియన్స్‌గా నిలిచింది. గెలిచిన జట్టుకు లక్ష రూపాయలు నగదు బహుమతితో పాటు ట్రోఫీని అంజనీపుత్ర అధినేత గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి చేతుల మీదుగా అందజేశారు. రన్నర్స్‌గా నిలిచిన ఎస్సారెస్ (ఎన్టీఆర్ నగర్) జట్టుకు రూ. 50 వేల నగదు బహుమతిని వసుధ హాస్పిటల్స్ సన్నీ పటేల్, కెల్విన్ హాస్పిటల్స్ కొమ్ము శ్రీనివాస్, ఉదారి చంద్రమోహన్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా గుర్రాల శ్రీధర్ మాట్లాడుతూ… ఐపీఎల్ తరహాలో ఈ స్థాయి టోర్నమెంట్ నిర్వహించిన గురూస్ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు దుర్గ ప్రసాద్, బింగి శివకిరణ్, వైద్య ప్రశాంత్, శ్రీనివాస్, బొంతల శివ, కోకాకోలా లక్ష్మణ్, సంతోష్ అభినందనీయులు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సూరినేని కిషన్, కాసర్ల సదానందం సహా ఇతర డైరెక్టర్లు పాల్గొన్నారు.

MPL1
రన్నరప్ జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న అంజనీపుత్ర అధినేత గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి

-శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *