Road Safety: ట్రాఫిక్ భద్రతపై అవగాహన పెంచేందుకు గురువారం మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ బీ సత్యనారాయణ మాట్లాడారు. రోడ్ భద్రతా నిబంధనలపై డ్రైవర్లకు సూచనలు అందజేసి, జాగ్రత్తలు పాటించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు రోడ్ భద్రత వారోత్సవాలు అనేక విధాలుగా నిర్వహించడం జరుగుతుంది. డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు, సిగ్నల్స్, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్ నడిపే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్టు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆటో డ్రైవర్లు, వాహనదారులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల
