ramangundam cp
ramangundam cp

Police Verification : తప్పుడు అఫిడవిట్ సమర్పిస్తే చర్యలు తప్పవు

  • రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్

Police Verification : తమపై ఎలాంటి కేసులు లేవని కొందరు తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ హెచ్చరించారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లకు చెందిన వారు పాస్‌పోర్ట్, ఉద్యోగ నియామకాలు, ఇతర పరిశ్రమల్లో నియామకాలకు సంబంధించి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ (PVC), పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (PCC) కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే, కొంతమంది గతంలో కేసులు నమోదైనప్పటికీ తమపై ఎలాంటి కేసులు లేవని తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.
ఈ విషయ రామగుండం కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ అధికారుల విచారణలో వెల్లడైందని, దరఖాస్తుదారుల్లో కొందరిపై గతంలో కేసులు నమోదైనట్లు గుర్తించినట్లు వివరించారు. తప్పుడు అఫిడవిట్ సమర్పించిన 20 మందిని గుర్తించామని, వారి పై కేసులు కూడా నమోదు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు.

తదుపరి ఘటనలు నివారించేందుకు భవిష్యత్తులో తప్పుడు అఫిడవిట్ సమర్పిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. నోటరీ చేసే వ్యక్తులు కూడా అఫిడవిట్ పొందిన వారికి తప్పుడు సమాచారంతో అఫిడవిట్ ఇస్తే కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించారు.

శెనార్తి మీడియా, గోదావరిఖని/మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *