- చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
MLA VIVEK : చెన్నూర్ నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేస్తానని చెన్నూర్ శాసన సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళ వారం నియోజక వర్గంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పర్యటించారు. రూ. 25 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో బస్ షెల్టర్, వాకింగ్ ట్రాక్, సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెన్నూర్ నియోజక వర్గంలో రూ. 100 కోట్లతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రూ. 40 కోట్లతో అమృత్ స్కీమ్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రజలకు తాగు నీటి ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. టీ ఎఫ్ ఐ డీ సీ ద్వారా మరిన్ని నిధులు తీసుకు వచ్చి నియోజక వర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఉన్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :