DHARMARAO PETA
కొలువుదీరిన నూతన పాలక వర్గం

OATH TAKING : నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారం

 

OATH TAKING : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ధర్మారావుపేట గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు శుక్రవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ధర్మరావుపేట గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్‌, పంచాయతీ రాజ్ ఏఈ జగన్, పంచాయతీ సెక్రటరీ అన్నపూర్ణ లు పాలక వర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు.

SARPANCH, UPA SARPANCH
సర్పంచు రాధ మనోజ్, ఉప సర్పంచు గోపు శ్రీనివాస్, వార్డు సభ్యులను అభినందిస్తున్న నాయకులు

ధర్మరావుపేట గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా జుగుణాకర్ రాధ మనోజ్‌, ఉప సర్పంచ్‌గా గోపు శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పార్వతి పద్మ, అజ్మీరా శ్రీవల్లి, ముత్యాల నవీన్ కుమార్, మాజీ ఎంపీటీసీ పార్వతి మల్లేష్‌తో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల (కాసిపేట) :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *