- పుట్టిన గడ్డ ఋణం తీర్చుకుంటా
- కరీంనగర్ కార్పొరేషన్ 10వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి సౌగాని కొమురయ్య
Saugani Komuraiah: ప్రజా బలంతో కరీంననగర్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో నిలిచి, గెలిచి పుట్టిన గడ్డ రుణంగా తీర్చుకుంటానని 10వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి సౌగాని కొమురయ్య స్సష్టం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ 10వ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సౌగాని కొమురయ్య ఇంటింటా ప్రచారం విస్తృతం చేశారు. తమ అనుచరులు, మద్దతు దారులతో కలిసి ఓటర్లను స్వయంగా కలుస్తున్నారు. కార్పొరేటర్ గా తనను గెలిపిస్తే తాను చేసే అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరిస్తున్నారు.
కరీంనగర్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు
కరీంనగర్ నగర రాజకీయాల్లో టికెట్ల కేటాయింపులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ బీసీలకు రిజర్వు అయ్యింది. దాదాపు మూడు దశాబ్ధాలకు విద్యా ప్రదాత పేరొందిన సౌగాని కొమురయ్యకు కార్పొరేటర్ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి బీజేపీ నాయకులు పార్టీలో చేర్చుకున్నారు. డివిజన్లో ప్రచారం చేసుకోవాలని చెప్పడంతో ప్రజల్లోకి వెళ్లారు. అయితే టికెట్ కేటాయింపు సమయంలో ఆ పార్టీ నిర్ణయం మారింది. డివిజన్‌తో సంబంధం లేని వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో సౌగాని కొమురయ్య అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. హామీ ఇచ్చి టికెట్ ఇవ్వకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.
నగరంలో విద్యా రంగంలో విశేష సేవలందిస్తున్న సౌగాని కొమురయ్య సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ మరింత గుర్తింపు పొందారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చారని అనుచరులు తెలిపారు. టికెట్ హామీ నేపథ్యంలోనే పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఈ అంశంపై స్పందించిన సౌగాని కొమురయ్య బీజేపీ నాయకులు తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీ నాయకులు చేసిన ద్రోహానికి వెన్ను చూపేది లేదని, ప్రజల మద్దతుతో ముందుకే సాగుతానని స్పష్టం చేశారు. డివిజన్ ప్రజలు, విద్యావంతులు, యువకులు, మహిళా సంఘాలు, కుల సంఘాల సహకారంతో స్వతంత్ర అభ్యర్థిగా తన ప్రచారాన్ని మరింత ముమ్మరంగా సాగిస్తున్నారు. పుట్టిన గడ్డ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు.
శెనార్తి మీడియా, కరీంనగర్
