LXPT
లక్షెట్టిపేట కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థులతో ఎంఎల్ఏ ప్రేంసాగర్ రావు

LUXETTIPET MUNICIPAL : లక్షెట్టిపేట మున్సిపల్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే

 

LUXETTIPET MUNICIPAL : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని 15 వార్డులకు సంబంధించి కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల పేర్లను మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేం సాగర్ రావు శుక్ర వారం రాత్రి పట్టణంలోని శ్రీనివాస్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించి కాంగ్రెస్ పార్టీ బీ ఫారంలు అందజేశారు. లక్షెట్టిపేట కాంగ్రెస్ పార్టీ మొదటి వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గోల్ల కాంతయ్యను, రెండవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా దొంత అంజలిని, మూడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా చల్ల నాగభూషణం, నాలుగవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మోత్కూరి రాజేశ్వరి, ఐదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా సింగారపు చిన్నయ్య, ఆరవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తోట సువర్ణ, ఏడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బోడ రాజులను ప్రకటించారు.

అలాగే ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా రాందేని చంద్రకళ, తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా వడ్డేపల్లి రాయలింగు, పదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పెండం పద్మ, 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా సూరం చంద్రమౌళి, 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పర్విన్ సుల్తానా, 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా చాతరాజు రాజన్న, 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా అడ్డగూరి రమేష్, 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గోపె సుజాతలను ప్రకటించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ గా దొంత అంజలి, వైస్ చైర్మన్ గా చల్లా నాగభూషణం పేర్లను సైతం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు ఆరీఫ్, ఆర్ జీ పీ ఎస్ అధ్యక్షులు త్రిమూర్తులు,ఆర్టీఏ మెంబర్ శ్రీనివాస్,సర్పంచ్ లు నలమెల రాజు, సత్యన్న, మున్సిపాలిటి, గ్రామాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల (లక్షెట్టిపేట) :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *