MUNICIPAL ELECTIONS : మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్ తో పాటు బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీలకు అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి కొన్ని డివిజన్ లలో, వార్డులలో అభ్యర్థులను ఎంపిక చేసి బీ ఫాంలు అందివ్వగా పెద్ద ఎత్తున ర్యాలీగా నామినేషన్ కేంద్రాల వరకు తరలివెళ్లి మద్దతుదారుడితో కలిసి నామినేషన్లు వేశారు. ప్రధాన మూడు పార్టీల నుంచి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో గురు వారం పెద్ద మొత్తంలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

మంచిర్యాల కార్పొరేషన్ లోని 60 డివిజన్లుండగా, బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 34 వార్డులు, చెన్నూర్ మున్సిపాలిటీలోని 18 వార్డులు, క్యాతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులు, లక్షెట్టిపేట మున్సిపాలిటీలో 15 వార్డులుండగా మొదటి రోజు 35 నామినేషన్లు రాగా రెండవ రోజైన గురు వారం ఆ సంఖ్య వంద దాటినట్లు సమాచారం. మరో వైపు ఈ నెల 30వ తేదీ నామినేషన్లకు ఆఖరు కావడంతో శుక్ర వారం పెద్ద మొత్తంలో నామినేషన్లు పడే అవకాశం ఉంది.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :
