Accident: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు శివారులో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హుజరాబాద్ మండలం మందాడిపల్లికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మొలంగూర్ నుంచి కూరగాయల మొక్కలను తీసుకెళ్తుండగా ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
– శెనార్తి మీడియా,శంకరపట్నం
