- బాధ్యతతో పాటు శ్రద్ధను పెంచుకోవాలి
- రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్
- రామగుండం కమిషనరేట్ పోలీసులకు ప్రమోషన్లు
- 10 మంది హెడ్ కానిస్టేబుళ్లు ఏఎస్ఐలుగా, ఇద్దరు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లకు ఏఆర్ఎస్ఐలుగా ఉద్యోగోన్నతులు
Promotions: పోలీస్ శాఖలో సిబ్బందికి ప్రమోషన్లతో గుర్తింపుతో పాటు ఉత్సాహం వస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 10 మంది హెడ్ కానిస్టేబుల్‌లకు ఏఎస్ఐగా, ఇద్దరు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌లకు ఏఆర్ఎస్ఐగా ప్రమోషన్లు లభించాయి. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ కమిషనరేట్ లో సోమవారం వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమిషనర్ వారి కొత్త ర్యాంక్ ప్రమోషన్ చిహ్నాలను అలంకరించి అభినందనించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడారు.

ప్రమోషన్లతో పోలీసు సిబ్బందికి గుర్తింపు, ఉత్సాహం వస్తుందన్నారు. ఏ రకమైన రిమార్క్ లేకుండా విధుల్లో మంచి పనితీరు చూపాలని, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. పోలీసు శాఖలో ప్రమోషన్ తో పాటు బాధ్యత కూడా పెరుగుతుందన్నారు. ప్రజలలో పోలీసు శాఖపై నమ్మకం, గౌరవం పెంచేలా క్రమశిక్షణతో పని చేయాలని సూచించారు. అలాగే ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ కష్టపడి పనిచేస్తే తప్పకుండా గుర్తింపు వస్తుందన్నారు. విధి నిర్వహణలో మరింత మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఆరోగ్యంపైనా శ్రద్ధ చూపాలన్నారు ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలం అని సీపీ అన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) సీ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేశ్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్‌ఐ మల్లేశం, రామగుండం పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లకుంట పోచలింగం, స్వామి తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల: