Mudhol MLA Ramarao Patel : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్కతో ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భేటీ అయ్యారు. మంగళవారం హైదరాబాద్ లో మంత్రిని కలిశారు. బాసర లో వసంత పంచమి వేడుకలపై ఏర్పాట్లపై చర్చించారు. ఆలయానికి రెగ్యులర్ ఈవో ను నియమించాలని కోరారు. గతం కంటే పెద్ద మొత్తంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగ కుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. వసంత పంచమి వేడుకలకు రావాలని మంత్రిని ఆహ్వానించారు. అదే విధంగా ప్రభుత్వం బాసర ఆలయ పునర్నిర్మాణానికి వెచ్చించిన రూ. 42 కోట్ల నిధులకు సంబంధించిన పనులను ప్రారంభించాలని కోరారు. నియోజకవర్గం లో పలు సమస్యలపై ఎమ్మెల్యే రామారావు పటేల్ మంత్రితో చర్చించారు.
– శెనార్తి మీడియా, బాసర