EX MINISTER JOGU : మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు హఠన్మరణం చెందగా అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసి ఆ నాయకుడికి తుది వీడ్కోలు పలికారు… ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ రోకండ్ల రమేశ్ శనివారం గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం నిర్వహించిన రమేశ్ అంత్యక్రియల్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న పలువురు పార్టీ నాయకులతో కలిసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తిర్పేల్లి స్మశాన వాటిక వరకు శవయాత్ర కొనసాగగా మాజీ మంత్రి రామన్న రోకండ్ల రమేష్ పాడే మోశారు. ఆయన పార్టీకి చేసిన సేవలను స్మరించుకున్నారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు పలువురు వివిధ రాజకీయ పార్టీల నాయకులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కాగా శని వారం రాత్రే బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై రమేశ్ మృత దేహానికి నివాళులర్పించారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల