bjp donations
bjp donations

Party Funds : బీజేపీకి వచ్చిన విరాళాల లెక్కలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Party Funds : 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీకి విరాళాలు గత ఏడాదితో పోలిస్తే 87 శాతం పెరిగాయి. ఈ విరాళాల మొత్తం రూ. 3,967.14 కోట్లకు చేరుకున్నాయి, అయితే పార్టీ మొత్తం వాటాలో ఎలక్టోరల్ బాండ్ల వాటా సగానికి పైగా పడిపోయింది. 2023-2024కి సంబంధించిన బీజేపీ వార్షిక ఆడిట్ రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. 2022-2023లో బీజేపీకి స్వచ్ఛందంగా అందించిన విరాళాలు రూ.2,120.06 కోట్ల నుంచి 2023-2024 నాటికి రూ.3,967.14 కోట్లకు పెరిగాయని ఎన్నికల సంఘం సోమవారం ప్రచురించిన వార్షిక నివేదిక వెల్లడించింది.

బిజెపి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ. 1685.62 కోట్లు పొందింది.  ఇది 43 శాతం. అదే సమయంలో, 2022-2023లో పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ. 1294.14 కోట్లు వచ్చాయి. ఇది 61 శాతం. గత ఏడాది ఫిబ్రవరిలో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు ప్రకటించి దానిని రద్దు చేసింది.

లోక్‌సభ ఎన్నికల సంవత్సరంలో సాధారణ ప్రచారానికి బీజేపీ చేసిన ఖర్చు గత ఏడాది రూ.1092.15 కోట్ల నుంచి రూ.1754.06 కోట్లకు పెరిగింది. ఇందులో ప్రకటనలు, ప్రచారానికి రూ.591.39 కోట్లు ఖర్చు చేశారు. విరాళాల విషయంలో బీజేపీ కంటే కాంగ్రెస్ చాలా వెనుకబడి ఉంది. కానీ ఎన్నికల సంవత్సరంలో కాంగ్రెస్ కు  విరాళాలు భారీగా పెరిగాయి.

కాంగ్రెస్‌కు వచ్చిన విరాళాలు ఇవే..

2022-2023లో రూ.268.62 కోట్లుగా ఉన్న పార్టీ విరాళాలు 2023-2024 నాటికి రూ.1,129.66 కోట్లకు 320 శాతం పెరిగిందని కాంగ్రెస్ వార్షిక నివేదిక వెల్లడించింది. పార్టీకి అందిన మొత్తం విరాళాల్లో ఎలక్టోరల్ బాండ్ల వాటా 73 శాతం. ఇది రూ. 828.36 కోట్లు. అయితే 2022-2023లో  ఈ మొత్తం రూ. 171.02 కోట్లు. కాంగ్రెస్ ఎన్నికల వ్యయం గతేడాది రూ.192.55 కోట్ల నుంచి ఒక్కసారిగా రూ.619.67 కోట్లకు పెరిగింది.

గత వారం ఎన్నికల సంఘం ప్రచురించిన 2023-2024 సంవత్సరానికి టీఎంసీ వార్షిక ఆడిట్ నివేదిక ప్రకారం, పార్టీ ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే 333.46 కోట్ల నుంచి రూ. 646.39 కోట్లకు పెరిగింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీకి దాదాపు 95 శాతం విరాళాలు అందాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *