Soil Transport
Soil Transport

Soil Mafia: మట్టిని మాయం చేస్తున్నరు..

  • మంచిర్యాలలో జోరుగా అక్రమ తవ్వకాలు
  • వందలాది ట్రిప్పులు తరలిస్తున్న దళారులు
  • పట్టించుకోని గనులు, రెవెన్యూ శాఖ అధికారులు

Soil Mafia:  మంచిర్యాల జిల్లాలో మట్టి అక్రమ తవ్వకాలు మళ్లీ ఊపందుకున్నాయి. మాన్యం, రెవెన్యూ నియమాలను తుంగలో తొక్కుతూ మట్టి వ్యాపారులు తమ దందాను సాగిస్తున్నారు. అధికార యంత్రాంగం నిర్లిప్తంగా వ్యవహరిస్తుండటంతో మట్టి మాఫియాకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.

దొరగాలపల్లి (Doragaripally)  నుంచి పెద్దఎత్తున మట్టి తవ్వకాలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళారులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వందలాది ట్రిప్పుల మట్టి తరలిస్తూ వ్యాపారులు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నాయి. ట్రిప్పునకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. గనుల శాఖను గాలికొదిలేస్తున్నారు.

Soil Transport
Soil Transport

ప్రజలు ఫిర్యాదులు చేసినా, అధికారుల నుంచి స్పందన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మైనింగ్ శాఖ కార్యాలయంలో అధికారులు కనిపించకపోవడం గమనార్హం. విచారణ కోరిన వారికి “ఇంకా తవ్వకం జరుగుతోంది. పూర్తయిన తరువాత చూస్తాం” అనే తీరుతో మట్టి దందాకు పరోక్షంగా సహకరిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ అక్రమ తవ్వకాలు ప్రధానంగా చలికాలం నుండి ఎండాకాలం దాకా నిరంతరం సాగుతున్నా, సంబంధిత శాఖలు నిస్సహాయంగా చూస్తూ నిలుస్తున్నాయి. వర్షాకాలంలో మాత్రం తాత్కాలికంగా కొన్ని వాహనాలను సీజ్ చేయడం తప్ప ఎలాంటి చర్యలు కనిపించలేదు.

మైనింగ్, రెవెన్యూ శాఖలు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే ఈ దందాపై త్వరితగతిన చర్యలు అవసరమని ప్రజలు కోరుతున్నారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *