- జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్
Prearana: విద్యార్థులు ఇష్టపడి చదివి ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతిగృహంలో 10వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రేరణ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తం నాయక్, జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య లతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదవాలని, పట్టుదలతో ఎంచుకున్న లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయలు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. 2025 వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలని, ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించి నాణ్యమైన విద్యాబోధన అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, డైట్ చార్జీలు పెంచి నూతన మెనును అమలు చేస్తూ సకాలంలో పోషక విలువల ఆహారాన్ని అందిస్తూ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, విద్యార్థులకు ఉచితంగా దుస్తులు, పుస్తకాలు అందించడం జరుగుతుందని తెలిపారు.
విద్యార్థులు ప్రభుత్వం కలిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుంటూ ప్రయత్న లోపం లేకుండా కృషి చేసి ఉన్నత చదువులతో ఎదగాలని అన్నారు. అనంతరం ఉత్తమ ఉ పాధ్యాయులు, ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన వారిని సన్మానించడంతో పాటు జాతీయ స్థాయిలో అండర్-17 క్రికెట్ జట్టుకు ఎంపికైన జైపూర్ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల వసతి గృహ విద్యార్థిని ఈ. సంజనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సహాయ వెనుకబడిన తరగతుల అధికారి డి. భాగ్యవతి, వసతి గృహ సంక్షేమాధికారులు పెండం శ్రీహరి, కొండా ధర్మానంద్ గౌడ్, మంద తిరుపతి, బొడ్డు శ్రీనివాస్, మోహిసిన్ అహ్మద్, నరేష్, ఎం.సరిత, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల