Jai Bapu.. Jai Bheem: కరీంనగర్ జిల్లా గన్నేరు వరం మండలం గుండ్లపల్లె, గునుకుల కొండాపూర్, చీమల కుంటపల్లె, పిచుపల్లె గ్రామాల్లో జై బాపు జై భీమ్ – జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ సిద్ధాంతాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లడానికే ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మానకొండూర్ నియోజకవర్గ కన్వీనర్ నమీడ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్, కాంగ్రెస్ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, బేతల్లి రాజేందర్ రెడ్డి, చిట్కూరి అనంతరెడ్డి, మాజీ జడ్పీటీసీ జువ్వాడి మన్మోహన్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాతంగి అనిల్, నేలపట్ల కనకయ్య, వోడ్నాల నరసయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లి శంకరయ్య, నాయకులు తాళ్ల పెళ్లి శ్రీనివాస్, తాళ్ల పెళ్లి రవి గౌడ్, అనుమండ్ల నరసయ్య, పెంకర్ల ప్రశాంత్,దొమ్మటి మల్లయ్య, నాగపురి శంకర్, సుధగోని మల్లేశం, కొరివి తిరుపతి, మాజీ సర్పంచులు, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాలొన్నారు.

–శెనార్తి మీడియా, గన్నేరువరం
