- SBI, HDFC, Axis, Yes Bank కీలక మార్పులు
Creadit Card Rules: క్రెడిట్ కార్డు వినియోగదారులకు 2025 సంవత్సరం కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకువచ్చింది. దేశంలోని ప్రధాన బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు పాలసీలను మారుస్తూ కొత్త రూల్స్ అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా SBI, HDFC, Axis, Yes Bank వంటి బ్యాంకులు రివార్డ్ పాయింట్లు, ఫీజులు, ఇతర ఛార్జీల్లో మార్పులు చేయగా, వీటిపై అవగాహన లేకపోతే వినియోగదారులకు నష్టం జరిగే అవకాశం ఉంది.
ప్రధానమైన మార్పులు – బ్యాంకుల వారీగా
యాక్సిస్ బ్యాంక్
- రివార్డ్ పాయింట్ల రిడెంప్షన్ పై కొత్త ఛార్జీలు: ఇకపై రివార్డ్ పాయింట్లను రిడీమ్ చేసుకోవడానికి అదనపు ఫీజు విధించనుంది.
- వడ్డీ రేట్లలో మార్పులు: క్రెడిట్ కార్డు బకాయిలపై వడ్డీ రేట్లను సవరించింది.
- ఇంధన (ఫ్యూయల్), అద్దె, వాలెట్ లావాదేవీలపై కొత్త ఛార్జీలు: ఈ కేటగిరీలకు సంబంధించి చెల్లింపులపై కొత్త ఛార్జీలు అమలు కానున్నాయి.
యెస్ (YES)బ్యాంక్
- విమాన టికెట్, హోటల్ బుకింగ్ లావాదేవీలపై రివార్డ్ పాయింట్ల తగ్గింపు: ఈ సేవల కోసం ఉపయోగించే లావాదేవీలపై ఇప్పటి వరకు ఉన్న రివార్డ్ పాయింట్లను తగ్గించింది.
- లాంజ్ యాక్సెస్ బెనిఫిట్స్‌పై పరిమితి పెంపు: విమానాశ్రయ లాంజ్ సదుపాయాలను వినియోగించుకునే వీలును సవరించింది.
HDFC బ్యాంక్
- రూ. 50,000 పైగా బిల్లుల చెల్లింపులపై 1% ఫీజు: ఇకపై ఒకసారి రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ బిల్లు చెల్లిస్తే అదనపు 1% ఛార్జీ విధించనుంది.
- రూ. 15,000 పైగా ఫ్యూయల్ ట్రాన్సాక్షన్లపై 1% ఫీజు: ఇంధన కొనుగోళ్లకు కూడా 1% అదనపు ఛార్జీ అమలు కానుంది.
SBI క్రెడిట్ కార్డ్
- ఎడ్యుకేషన్ ఫీజు, ప్రభుత్వ బిల్లులు, అద్దె, BBPS చెల్లింపులపై రివార్డ్ పాయింట్ల రద్దు: ఈ కేటగిరీల్లో జరిపే లావాదేవీలకు ఇకపై రివార్డ్ పాయింట్లు వర్తించవు.
- రూ.50,000 పైగా యుటిలిటీ బిల్లులపై 1% అదనపు ఛార్జీ: ఎలక్ట్రిసిటీ, నీటి బిల్లులు వంటి సేవలకు ఎక్కువ మొత్తంలో చెల్లింపులపై కొత్త ఫీజులు అమలు కానున్నాయి.
కొత్త మార్పులపై వినియోగదారుల జాగ్రత్తలు
ఈ మార్పులు వినియోగదారులపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉన్నందున క్రెడిట్ కార్డు హోల్డర్లు అప్రమత్తంగా ఉండాలి. రివార్డ్ పాయింట్ల తగ్గింపు, కొత్త ఛార్జీలను ముందుగానే తెలుసుకోవడం వల్ల అనవసర ఖర్చులను నివారించవచ్చు. అలాగే, క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో చెల్లించడం ద్వారా క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపర్చుకోవచ్చు.
ఈ కొత్త మార్పులను అనుసరించి క్రెడిట్ కార్డు వినియోగాన్ని సురక్షితంగా, సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవడం అత్యంత అవసరం.