MANGALYA : హైదరాబాద్ వనస్థలిపురం మాంగళ్య (MANGALYA) షాపింగ్ మాల్ (SHOPING MALL) లో గురు వారం ప్రథమంగా సారీ డ్రాపింగ్ (SAREE DRAPING) కార్యక్రమం నిర్వహించారు. మాంగళ్య షాపింగ్ మాల్ చైర్మన్ కాసం నమశ్శివాయ మాట్లాడుతూ చీరకట్టు స్త్రీ అందాన్ని మరింత పెంచుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో మహిళలకు సరసమైన ధరలలో తీరొక్క డిజైన్ లలో వస్త్రాలు అందుబాటులో ఉంచామని తెలిపారు.

చెన్నైకి చెందిన ప్రముఖ సారీ డ్రాపర్ (SAREE DRAPPER) కవిత ప్రత్యేకంగా హాజరై చీరను నైపుణ్యంగా ధరించే విధానాన్ని ప్రదర్శించారు. ఏ మోడల్ చీరకు ఎలా తయారు కావాలో మహిళలకు అవగాహన కల్పించారు. చీర కట్టుతోనే మహిళలకు మరింత అందాన్ని తెచ్చిపెడుతుందని, ఎలాంటి చీరలు ఎంచుకోవాలో వివరించారు.

ఫ్యాషన్ డిజైనర్లు (FASHION DESIGNERS), బ్యూటీ పార్లర్ (BEAUTY PARLOUR) రంగ ప్రముఖులు ఈ ఈవెంట్ (EVENT) ను ఆసక్తిగా గమనించి, మాంగళ్య షాపింగ్ మాల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాంగళ్య షాపింగ్ మాల్ డైరెక్టర్లు కాసం శివ, పుల్లూరు అరుణ్, తోనూపునూరి అరుణ్, ప్రముఖులు, వ్యాపారులు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, హైదరాబాద్ :