SRR
విద్యార్థినికి మెమొంటో అందజేస్తున్న ఎంవీఐ ఖాసిం

SRR JR COLLEGE : ఎస్ఆర్ఆర్ ఫేర్ వెల్ హంగామా

SRR JR COLLEGE : మంచిర్యాలలోని ఎస్ఆర్ఆర్ జూనియర్ కళాశాల (SRR JR COLLEGE) ఫేర్ వెల్ (FAREWELL) వేడుకలు మంచిర్యాల గార్డెన్స్ లో శుక్ర వారం ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంవీఐ (MVI) ఖాసిం, డీఐఈఓ (DIEO) అంజయ్యలు విద్యార్థులనుద్దేశించి వారు మాట్లాడారు. క్రమ శిక్షణతో చదివి మంచి ర్యాంకులు సాధించాలని కోరారు.

SRR JR
నృత్యాలు చేస్తున్న విద్యార్థులు

అనంతరం వివిధ గ్రూపులలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమొంటోలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంటు పెట్టం మల్లేష్, డైరెక్టర్లు శ్రీనివాస్, బాకం రాజు, మనయ్య, శ్రీఖర్, అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *