- రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్
- ఏర్పాట్ల పరిశీలన
Vemulawada Temple : మహా శివరాత్రి జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (SP Akhil Mahajan) తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లడించారు. గురువారం ఆయన ఆలయ ప్రాంగణం, వీఐపీ, వీవీఐపీ, జనరల్ పార్కింగ్, శివార్చన , ధర్మగుండం , కల్యాణకట్ట, క్యూ లైన్స్ ,బద్ది పోచమ్మ ఆలయ ప్రాంగణంతో పాటు జాతర ప్రాంతాల్లో చేస్తున్న ఏర్పాట్లను పోలీస్, ఆలయ అధికారులతో కలసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ(SP) మాట్లాడారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 25 నుంచి 27 వరకు జరిగే మహా శివరాత్రి జాతర సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా, జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రధాన ఆలయంతో పాటుగా అనుబంధ ఆలయాల వద్ద పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరిగే ఆవకాశం ఉన్నందున ఆలయ ప్రాంగణం, వీఐపీ, వీవీఐపీ, జనరల్ పార్కింగ్, శివార్చన, ధర్మగుండం, కల్యాణకట్ట, క్యూ లైన్స్, బద్ది పోచమ్మ ఆలయంతో పాటు ఇతర ప్రాంతాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సులువుగా దర్శనం అయ్యేలా పట్టణంలో ప్రధాన మార్గాలో రూట్ మ్యాప్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్పీ వెంట పట్టణ ఇన్‌స్పెక్టర్ వీరప్రసాద్, ఎస్ఐ రాజు, ఈఈ రాజేష్, డీఈ మహిపాల్ రెడ్డి, ఏఈ రామ్ కిషన్ రావు, ఏఈ ఓ శ్రవణ్ కుమార్ ఆలయ, పోలీస్ సిబ్బంది ఉన్నారు.