- విద్యార్థి సంఘం నాయకుడిపై కేసు
Fight in Bar: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాల్ టెక్స్ ఏరియా(Caltex Area)లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో తాండూర్‌కు చెందిన బండారు వంశీ అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలిలి ఉన్నాయి. తాండూర్‌కు చెందిన ముగ్గురు యువకులు, బెల్లంపల్లి గాంధీనగర్‌కు చెందిన విద్యార్థి సంఘ నాయకుడు(student leader) అల్లి సాగర్, అతని స్నేహితులు మద్యం తాగేందుకు రెస్టారెంట్‌కు వెళ్లారు. రెస్టారెంట్‌లోని ఏసీ హాల్‌లో వేర్వేరు టేబుల్లో కూర్చొన్న ఇరు వర్గాల మధ్య వివాదం మొదలైంది.
బేరర్‌ను పిలిచినా స్పందన రాకపోవడంతో వంశీ టేబుల్‌పై ప్లేట్‌తో శబ్దం చేశాడు. ఈ విషయంలో అల్లి సాగర్ మద్యం మత్తులో వంశీతో వాగ్వాదానికి దిగాడు. మాట మాట పెరగడంతో అల్లి సాగర్ బీరు సీసా పగలగొట్టి వంశీ తలపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన వంశీ రక్తస్రావంతో కుప్పకూలాడు.
రెస్టారెంట్ సిబ్బంది వెంటనే అతన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు., మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలలోని ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ మహేందర్ విద్యార్థి సంఘ నాయకుడు అల్లి సాగర్ పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల :
