Mathsyagirindraswamy: మండలంలోని కొత్తగట్టు శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి దేవస్థానంలో గురువారం ఆలయ హుండీలను లెక్కించారు. 8 నెలలకు సంబంధించిన హుండీ ఆదాయం 1,44 144=00 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పగల్ల మల్లారెడ్డి, దేవాదాయ శాఖ పరిశీలకులు పీ సత్యనారాయణ, ధర్మకర్తలు కేశవన ఐలయ్య, తీగల కుమారస్వామి గౌడ్, గరిగే ప్రభాకర్, మొక్కిరాల కళింగ రావు కొయ్యడ నీలమ్మ, కార్యనిర్వహణ అధికారి కే సుధాకర్,అర్చకులు, ఆలయ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా,శంకరపట్నం