Amith Thapa : లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ISAME కాన్ఫరెన్స్ హైదరాబాదులో నిర్వహిస్తున్న సందర్భంగా వివిధ దేశాల లయన్స్ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్న సందర్భంలో లయ న్స్ క్లబ్ అఫ్ కాట్మండు నేపాల్ నుండి బుల్లెట్ బైక్ పై రోడ్డు మార్గం గుండా గోరకపూర్,బనారస్, నాగపూర్ గుండా ఆదిలాబాద్ చేరుకోవడం జరిగింది. అదిలాబాదులో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్స్ , కాటన్ సిటీ ప్రతినిధులు లయన్ అమిత్ తాప కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయనను సన్మానించారు. అమిత్ తాప మాట్లాడుతూ ఇండోనేపాల్ లయన్స్ ప్రతినిధుల మధ్య ఒక స్నేహ పూర్వక, పరస్పర సహకారం పొందడానికి, ఇరు దేశాల మధ్య లయ న్స్ స్నేహo అదిలాబాద్ లయ న్స్ ప్రతినిధులను కలవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్స్ మరియు కాటన్ సిటీ అధ్యక్ష ప్రధాన, కార్యదర్శులు పుప్పల నరేందర్, గంగయ్య, నాయకులు అనంత్ దేశ్పాండే, కాలేవార్ ప్రకాష్,కరీం అలీ నూరాలి, అన్వర్ అలీ ఆజాని, బండారి దేవన్న,ప్రేమ్ రాజు గౌడ్, సత్యనారాయణ, దయానంద్ రెడ్డి, 320జి జిల్లా గ్యాట్ మార్కెటింగ్ చైర్ పర్సన్ రమాకాంత్ పాల్గొన్నారు
-శెనార్తి మీడియా, ఆదిలాబాద్