TEACHERS DAY : మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ తెలంగాణ మోడల్ స్కూల్(Telangana Model School)లో గురు వారం అడ్వాన్స్ టీచర్స్ డే (Teacher’s Day) వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అధ్యాపకులుగా మారి బోధన చేశారు. ఉపాధ్యాయులకు వివిధ రకాల ఆటలు, వినోదాత్మక పోటీలు నిర్వహించారు. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించే ఉద్దేశంతో సెల్ఫ్ గవర్నమెంట్ డే(Self Government Day) ను నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ పాత్రల్లో వ్యవహరించి పాఠశాల నిర్వాహణలో తాత్కాలిక బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాటలు, నృత్యాలు, ప్రసంగాలతో టీచర్స్ డే వేడుకులను మరింత సందడిగా మార్చారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న (Mutyam Buchanna) మాట్లాడుతూ ఉపాధ్యాయుల పట్ల గౌరవం, కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి టీచర్స్ డే ఒక విశిష్టమైన సందర్భమని పేర్కొన్నారు. విద్యార్థులు కూడా ఈ రోజును స్పూర్తిదాయకంగా తీసుకొని చదువులో, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు గురువులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :
