Yadav's
Yadav's

Yadav’s :చదువుతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి

  • డాక్టర్ రవికిరణ్ యాదవ్

Yadav’s : చదువుతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమని సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ అన్నారు. ఇటీవల ప్రమోషన్లు పొందిన యాదవ టీచర్లు, ఉత్తమ ఉపాధ్యాయులను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు.

యాదవ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీఎస్ హెచ్ఎంలుగా ప్రమోషన్లు పొందిన నరకట్ల రాములు యాదవ్, సవ్వాయి ప్రకాష్ యాదవ్, స్కూల్ అసిస్టెంట్ గా ఉద్యోగోన్నతి పొందిన కాడిగిరి ప్రతిమా యాదవ్‌తో పాట , టీచర్స్ డే సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారం పొందిన రాజేందర్ యాదవ్ లను యాదవ సంఘం ఆధ్వర్యం లో సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికిరణ్ యాదవ్ మాట్లాడారు. చదువుకుంటే అన్ని రంగాల అభివృద్ధి సాధ్యమన్నారు.. ఉద్యోగోన్నతి పొందిన, ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారం పొందిన టీచర్లను ఆయన అభినందించారు.. యాదవులు అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధించాలన్నారు.

Yadav's
Yadav’s

కార్యక్రమంలో జిల్లా యాదవ సంఘం అధ్యక్ష కార్యదర్శులు అసుర హన్మాండ్లు యాదవ్, మంచాల మల్లయ్య యాదవ్,గౌరవ అధ్యక్షుడు రాజు యాదవ్, మంగారపు మహేందర్ యాదవ్, భీమన్న యాదవ్, విజయబాబు యాదవ్, ప్రఫుల్ యాదవ్, నర్రా నవీన్ యాదవ్, శరత్ యాదవ్, వేణుగోపాల్ యాదవ్,  రవికాంత్ యాదవ్, మహేందర్ యాదవ్, పండరి యాదవ్, పూరషోత్తం యాదవ్, కృష్ణమీనన్ యాదవ్, నాగభూషణం యాదవ్, మహేందర్ యాదవ్, అసుర రమేష్ యాదవ్,కావటి రమేష్ యాదవ్, యాదవ ఉద్యోగులు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, ఆదిలాబాద్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *