Gattu Mallanna : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామంలోని పాండవులచే ప్రతిష్ఠించబడిన గట్టు మల్లన్న ఆలయంలో జనవరి 13 న సోమవారం రోజున 3వ గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతినెల ఆరుద్ర నక్షత్రం రోజున నిర్వహించే ఈ గిరి ప్రదక్షిణ భక్తులకు పవిత్రమైన అనుభూతిని అందిస్తుంది. ఈ కార్యక్రమం చిలుకూరి బాలాజీ శివాలయ ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మరాం మహరాజ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. భక్తులు ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొని గట్టు మల్లన్న ఆశీర్వాదాలు పొందాలని నిర్వాహకులు ఆహ్వానం పలుకుతున్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల

Jai Gattu mallanna