
BIRD WALK : మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని కవ్వాల్ అభయారణ్యంలో జన్నారం ఇంఛార్జీ రేంజ్ ఆఫీసర్ సుష్మా ఆధ్వర్యంలో ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించిన బర్డ్ వాక్ ఆకట్టుకుంది. జిల్లా నుంచే కాకుండా నిర్మల్, హైదరాబాద్, గుంటూరు, మహారాష్ట్ర నుంచి పక్షి ప్రేమికులు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో తరలివచ్చి ఈ బర్డ్ వాక్ లో పాల్గొన్నారు.

అటవీలోని గోండుగూడ బైసన్ గుంట ప్రాంతంలో ఇండియన్ రాబిన్, ఓరియంటల్ మాగ్పీ రాబిన్, ఆశీ ప్రినియా, క్రెస్టెడ్ సెర్పింట్ ఈగల్, వూలీ నెక్డ్ స్టోర్క్, లెస్సర్ విస్లింగ్ డక్, వైట్ బ్రెస్టెడ్ వాటర్ హెర్న్, కామన్ మైనా, స్కాలీ బ్రీస్టెడ్ మైనా, ఇండియన్ నూతచ్, యెల్లో పూటెడ్ గ్రీన్ పీజియన్, పారాకీట్స్, కామన్ ఐయోరా, ఇండియన్ సిల్వర్ బిల్ తదితర 45 రకాల పక్షులను గుర్తించినట్లు అటవీ అధికారులు వెల్లడించారు. ఈ బర్డ్ వాచ్ కు అటవీ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పక్షులతో పాటు జంతువులు కనబడటంతో పర్యాటకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జన్నారం డీఆర్వో తిరుపతి, ఎఫ్బీఓలు లాల్ భాయ్ (గోండుగూడ), సాయి (డండేపల్లి), ఎఫ్ఎస్ఓలు శివ(చింతగూడ), నహీదా(తపాల్ పూర్), సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల:
