Kolkata Law Student: కోల్‌కతా లా కళాశాలలో చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడి తరపు న్యాయవాది న్యాయవాది రాజు గాంగూలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా మెడపై ప్రేమ గాట్లు ఉన్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు.
“ప్రాసిక్యూషన్ గాట్లు ఉన్నాయని చెబుతోంది. కానీ ప్రేమ గాట్లు కూడా ఉన్నాయన్నది ఎవరికైనా మీరు చెప్పారా? నిజంగా ఇది అత్యాచారమైతే నిందితుడి శరీరంపై ప్రేమ గాట్లు ఎలా ఉంటాయి?” అంటూ ఆయన ప్రశ్నించారు.
‘బాధితురాలి వాంగ్మూలంలో చాలా అసమానతలు ఉన్నాయి…’
మీడియాతో మాట్లాడిన గంగూలీ, బాధితురాలి వాంగ్మూలంలో అనేక అసమానతలు ఉన్నాయన్నారు. తన క్లయింట్‌ను ఇరికించడానికి కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. బాధితురాలి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, ఆమె కాల్ రికార్డులను విశ్లేషించారా అని ఆయన ప్రశ్నించారు.
బాధితురాలి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారా అని తాము ప్రాసిక్యూషన్‌ను అడిగామని చెప్పారు. అయితే, దానిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారా? బాధితుడి కాల్ వివరాలను పోలీసులు తనిఖీ చేశారా? ఈ కేసులో చాలా విషయాలు ఈ అంశాలపై ఆధారపడి ఉన్నాయన్నారు
మోనోజిత్ మిశ్రా తృణమూల్ విద్యార్థి విభాగానికి మాజీ నాయకుడు. అతడితో పాటు మరో ఇద్దరిపై విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. న్యాయ వైద్య పరీక్షలో మోనోజిత్ శరీరంపై గాట్లు ఉన్నట్లు తేలింది. అవి బాధితురాలి ప్రతిఘటనలో భాగంగా ఏర్పడ్డవని పోలీసులు భావిస్తున్నారు.
కానీ గాంగూలీ మాత్రం బాధితురాలి వర్ణనలో స్పష్టత లేదని, తన క్లయింట్‌ను కుట్ర పద్ధతిలో ఇరుకున పెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కేసు విషయాన్ని పరిశీలిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో సాక్ష్యాలను పరిశీలిస్తున్నారు.
శెనార్తి మీడియా, వెబ్ డెస్క్