TEACHERS MLC : కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎం ఎల్ సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఖరారైంది. మొత్తం 25,041 ఓట్లు పోలవగా ఇందులో 897 ఓట్లు చెల్లనివిగా లెక్కింపు అధికారులు గుర్తించారు. చెల్లు బాటైన ఓట్లు 24,144 కాగా గెలుపు కోటా ఓట్లు 12,073గా నిర్ధారించారు. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959 ఓట్లు పోలయ్యాయి. 12,073 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కొమురయ్య విజయం ఖరారైంది. వంగ మహేందర్ రెడ్డికి 7,182 ఓట్లు రాగా అశోక్ కుమార్ కు 2,621 ఓట్లు, కూర రఘోత్తం రెడ్డికి 428 ఓట్లు వచ్చినట్లు సమాచారం. బీజేపీ అభ్యర్థి కొమురయ్య విజయం సాధించినట్లు ఎన్నికల కమీషన్ ఆమోదం రావాల్సి ఉంది.
-శెనార్తి మీడియా, కరీంనగర్ :
