Matsya Girindra Swamy:మండలంలోని కొత్తగట్టు శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి ఆలయంలో జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా హుండీ ఆదాయం గణనీయంగా నమోదైంది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8 వరకు నిర్వహించిన ఉత్సవాల్లో మొత్తం రూ.12,98,677 ఆదాయం వచ్చినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.
వేలం ద్వారా రూ.6,16,000, టికెట్ విక్రయాల ద్వారా రూ.2,34,612, హుండీ ద్వారా రూ.4,48,065 సమకూరినట్లు తెలిపారు. అదనంగా 90 గ్రాముల మిశ్రమ వెండి, నాలుగు గ్రాముల మిశ్రమ బంగారం భక్తులు సమర్పించినట్లు పేర్కొన్నారు.
ఈ ఆదాయం లెక్కింపు కార్యక్రమం సహాయక కమిషనర్ కార్యాలయం నుంచి పర్యవేక్షకుడు పి. సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. దేవాలయ కార్యనిర్వహణాధికారి సుధాకర్, ఆలయ చైర్మన్ కోరం రాజిరెడ్డి నేతృత్వంలో ధర్మకర్తల మండలి సమక్షంలో హుండీ లెక్కింపు జరిగింది. అర్చకులు శేషం మురళీధరాచార్యులు, శేషం మాధవాచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, శంకరపట్నం
