- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య
RAJAKA MEETING : రజక వృత్తిపై ఆదారపడి జీవనం సాగిస్తున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య ఆన్నారు. చార్వాక ట్రస్ట్ భవనంలో సోమ వారం జరిగిన తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షలాదిమంది రజకులు ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.
జిల్లా అధ్యక్షులు తంగళ్ళపల్లి వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాయిరాల రాములు, జిల్లా ఉపాధ్యక్షులు గంగరాజుల రామచంద్రం, నడిగోట తిరుపతి, జిల్లా సహాయ కార్యదర్శి పైతారి ఓదేలు, ముషికే చందర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంగెపు హనుమంతు, జాలిగాపు రాజేశ్వరి, తరిగొప్పుల భాగ్య, తోట కళావతి, కంచర్ల శ్రీనివాస్, పున్నం సమ్మయ్య, పాయిరాల రమేష్, కొండపర్తి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :