BJP Booth Committe: బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో గురువారం మండలంలోని వివిధ గ్రామాల బూత్ కమిటీలకు అధ్యక్షులను ఎన్నకున్నారు. మండల ఎన్నికల అధికారి ఆకుల రాజేందర్ వ్యవహరించారు. కేశవపట్నం గ్రామంలోని 107 వ బూత్ అధ్యక్షుడిగా బొజ్జ కుమార్, 112వ బూత్ అధ్యక్షుడిగా నాగవల్లి జగదీష్, మొలంగూర్ లోని 115వ బూత్ అధ్యక్షుడిగా దాసారపు తిరుపతి, 117వ అధ్యక్షుడిగా ప్రొద్దుటూరు వెంకన్న, గద్దపాక గ్రామానికి చెందిన 126వ బూత్ అధ్యక్షుడిగా రెడ్డి రమణారెడ్డి, 127వ బూత్ అధ్యక్షుడిగా జంగా సతీష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు కొమురయ్య, మండల ప్రధాన కార్యదర్శి దాసారపు నరేందర్, శక్తి కేంద్ర సంయోగులు దొంగల రాములు, రాసమల్ల శ్రీనివాస్, నాయకులు బొజ్జ సాయి ప్రకాష్, బోడ తిరుపతి, తోట అనిల్, వివిధ గ్రామాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా,శంకరపట్నం