Cheyutha Foundation: చిట్యాల మండలంలోని జూకల్ హైస్కూల్లో చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఫౌండేషన్ అధ్యక్షుడు మ్యాదరి సునీల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కృష్ణ మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం చేయూత ఫౌండేషన్(Cheyutha Foundation) అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదన్నారు. సామాజిక స్పృహతో మానవసేవే మాధవసేవ అనే నినాదంతో సేవలందిస్తున్నారని తెలిపారు. పిల్లలు చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో ఈ సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిస్ ప్యాబ్లస్ ఇండియా ఫస్ట్ రన్నర్‌అప్ శ్రీహర్షిత, జానపద గేయ రచయితలు దాసారపు నరేష్, బానోతు రాజ్ నాయక్ హాజరై, విద్యార్థులను ప్రోత్సహించారు. ఉపాధ్యాయ బృందం ఎండీ రఫీ, యోగి, రూప రాణి, రంజిత్, సునీతతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.