congress pressmeet
congress pressmeet

Congress Meeting: 4న బహిరంగ సభను విజయవంతం చేయాలి

  • కరీంనగర్‌లో కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో నేతల పిలుపు

Congress Meeting: ఈ నెల 4న హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సన్నాహక సమావేశం జరిగింది. నగరంలోని హోటల్ వీ పార్క్‌ లో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఒక సోదరుడిగా మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. బహిరంగ సభకు హాజరయ్యే ప్రతి కార్యకర్తకు తన వంతుగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. విభేదాలకు స్థానం లేకుండా ముందుకు సాగాలని కోరారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు మనకు అవసరమని చెప్పారు. మహిళల కోసం ఏసీ బస్సులు లేదా వాహనాల సౌకర్యం కల్పిస్తాని తెలిపారు. ఈ సభ ద్వారా ప్రతిపక్షాలకు మన బలాన్ని చూపించాలన్నారు. పోటీ చేయాలనుకునే కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తాను. సోషల్ మీడియా కార్యకలాపాల కోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నానని వెల్లడించారు.

తొలుత కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు నిర్వహించిన డాక్టర్స్ డే కార్యక్రమానికి హాజరుకాలేకపోయానని తెలిపారు.
ఈ బహిరంగ సభతోనే రాబోయే ఎన్నికల విజయానికి నాంది పలకాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. డీసీసీ కార్యాలయం నుంచి ఒక్కసారిగా బయలుదేరాలన్నారు. వ్యక్తుల కన్నా హోదాకు గౌరవం ఇచ్చే విధంగా ప్రోటోకాల్ పాటించాలని కోరారు. నాయకులు క్షేత్రస్థాయిలో కార్యకర్తల తరలింపుపై దృష్టి పెట్టాలని సూచించారు.

congress leaders
congress leaders

సన్నాహక సమావేశంలో వైద్యుల అంజన్ కుమార్, కొరివి అరుణ్, బానోత్ శ్రావణ్ నాయక్, చాడ గొండ బుచ్చిరెడ్డి, సరిల్లా ప్రసాద్, భూమా గౌడ్, పిట్టల శ్రీనివాస్, నెతికుంట యాదయ్య, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, చర్ల పద్మ, సిరాజు హుస్సేన్, వెన్నం రజిత రెడ్డి, పహాద్, జాల స్వామి గౌడ్, నిహాల్, అహమ్మద్ అలీ, మునిగంటి అనిల్, కుర్ర పోచయ్య, రాచకొండ ప్రభాకర్, అజీమ్ మహమ్మద్, వెన్న రాజ మల్లయ్య, బొబ్బిలి విక్టర్, అబ్దుల్ రహమాన్, పెద్ది గారి తిరుపతి, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, వంగల విద్యాసాగర్, గంగుల దిలీప్, చాంద్, అస్తపురం తిరుమల, ముల్కల కవిత యోనా, మేకల నరసయ్య, తోట అంజయ్య, హస్తపురం రమేష్, కట్ల సతీష్, నెల్లి నరేష్, బేతి సుధాకర్ రెడ్డి, వసీం, ఇమ్రాన్, కొలగాని అనిల్, చింతల కిషన్, మూల జైపాల్, కుంభాల రాజకుమార్, పెంచాలా లక్ష్మణరావు, సాయిని తిరుపతి, గన్ను మహేందర్ రెడ్డి, బుర్ర హరీష్, వీర దేవేందర్, రూపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్, కాంపెళ్లి కీర్తి కుమార్, జ్యోతి రెడ్డి, గడప అజయ్ తదితరులు పాల్గొన్నారు

శెనార్తి మీడియా, కరీంనగర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *