CULTURAL
చిన్నారికి బహుమతి అందజేస్తున్న నిర్వాహకులు

CULTURAL PROGRAMS : ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

CULTURAL PROGRAMS : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సింగరేణి రిటైర్డ్ కాలనీ(Singareni Retirement Colony) లో ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ లక్ష్మి గణేష్ మండలి నవరాత్రోత్సవాలలో భాగంగా గురు వారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి సభ్యులు మేడం తిరుపతి, ఎంబడి సమ్మయ్య, హరిదాసు వేణు, రామంచ సంపత్, గాండ్ల సుధీర్, వేముల శ్రీనివాస్, పెండ్యాల ఆంజనేయ ప్రసాద్, లింగయ్య, వేముల మల్లేష్, చిన్నయ్య, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

CULTURAL PRG
చిన్నారికి బహుమతి అందజేస్తున్న నిర్వాహకులు
  • బహుమతులు అందుకున్న చిన్నారులు వీరే…

శ్రీశ్రీశ్రీ లక్ష్మి గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సోలో డాన్స్ (Solo Dance) జూనియర్స్ లో కే నిత్యశ్రీ, హర్షవర్ధిణి, సీనియర్స్ లో సాయిని జ్యోత్స్న, రేగళ్ల సాన్వి, గ్రూపు డాన్స్ (Group Dance) లో ఈశ్వాని – శివాని, రేగళ్ల సాన్వి – రేగళ్ల అన్వితశ్రీ, సింగింగ్ (Singing) లో శ్రీ వర్షిత్, విశ్వానిలు ప్రతిభ కనబర్చి బహుమతులు అందుకున్నారు. చిన్నారులను కమిటీ సభ్యులతో పాటు కాలనీ వాసులు అభినందించారు.

– శెనార్తి మీడియా, నస్పూర్ (మంచిర్యాల) : 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *