KCR Birthday: స్వ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆదేశాల మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ యువ నాయకుడు నడిపెల్లి విజిత్ రావు హాజరై మాట్లాడారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారని కొనియాడారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ర్ట వచ్చి ఉండేది కాదన్నారు. ఉద్యమంలో ఎన్నో అవమానాలు, ఆటుపోట్లను ఎదుర్కొని స్వ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన యోధుడని కొనియాడారు.

తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సామాజిక బాధ్యతగా మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు బ్రెడ్లు, పండ్లు (fruits distribution)పంపిణీ చేశామని తెలిపారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకంగా ఆహారం అందజేసి, వారితో ముచ్చటించారు. అనంతరం కేక్ కట్(Cake cutting) చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల
